Wednesday, December 08, 2010

నీ మరణం క్షణికం... నా మరణం క్షణక్షణం

నీ మరణం క్షణికం... నా మరణం క్షణక్షణం
ఎంత అద్భుతంగా చెప్పాడు ఎరిక్ సీగల్...
లవ్‌స్టోరీ... చూడ్డానికి సినిమా స్క్రిప్ట్‌లా ఫాస్ట్‌గా సాగే ఈ పుస్తకం.. చివరికొచ్చేసరికి గొంతుకేదో అడ్డం పడ్డట్టుగా, గుండె బరువెక్కినట్టుగా మారుస్తుంది. డబ్బున్న కుర్రాడు పేదింటి అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. రొటీన్ లవ్‌స్టోరీ... అనుకున్నా... సీగల్ సిరాలో భిన్నంగా సాగుతుంది. ఒలివర్, జెన్నీ క్యారెక్టర్ల సృష్టి... యువకుడిగా ఒలివర్ మానసిక అస్తిత్వంకోసం పోరాడటం... వావ్ బాగా చదివించాడు. చివర్లో ఏడిపించాడు. నిజానికిది సినిమా స్క్రిప్ట్. సినిమా షూటింగ్ పూర్తై... రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న టైమ్‌లో నిర్మాత సలహాతో ఎరిక్ దీన్ని నవలగా అచ్చువేయించాడు. బుక్ సూపర్‌హిట్టైంది... సినిమా కూడా సూపర్ హిట్. లవ్‌స్టోరీ ప్రేరణతో ఓ హిందీ సినిమా కూడా వచ్చింది. ప్రతీ ప్రేమకథా పెళ్లితో ముగుస్తుంది. ఇక్కడ పెళ్ళితో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఒలివర్, జెన్నీ కష్టాలు పంచుకుంటారు. జీవితంలో ఒక్కోసారి బాధలు కూడా మరిచిపోలేని అనుభూతులవుతాయి కదా... చివర్లో జెన్నీ
మొత్తానికి నాకైతే నచ్చింది.